Monday, May 24, 2021

వాత, పిత్త, కఫం - డా. జిలుకర శ్రీనివాస్

  వాత, పిత్త, కఫం - డా. జిలుకర శ్రీనివాస్


వాతం చేసి కాళ్లు లాగుతాయి. నరాలు తీపులు పెడుతాయి. ఒంట్లో బలం లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అల్లోపతి డాక్టర్ వాతం అనేది వుండదని నమ్ముతాడు. ఎందుకంటే అది ఏ పరీక్షలో కనపడదు కనుక. మరో రకంగా చెప్పాలంటే వాతాన్ని గుర్తించే పరికరం అల్లోపతి పద్ధతిలో లేదు కనక. కాబట్టి డాక్టర్ గారు బలానికి ఐరన్, మల్టీవిటమిన్, క్యాల్షియం టాబ్లెట్లను రాస్తాడు. ఇదీ కత. 

వాత, పిత్త, కఫాన్ని గుర్తించే విధానం ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, హోమియో, యునాని, సిద్ధ వైద్య విధానాలలో ఉన్నాయి. అవి చక్కటి పరిష్కారం చూపిస్తున్నాయి. 

మందు శాస్త్రీయమైనది అయితే అది అందరికీ పని చేయాలి అనేది అల్లోపతి వాదన. ఈ వాదన వల్ల సైంటిఫిక్ మెడిసిన్ పేరుతో ఒకే మందును వేర్వేరు శరీర ధర్మాలు గల పేషెంట్లకు ఇవ్వడం వల్ల ఫలితాలు ఒకేరకంగా రాబట్టలేక పోయింది. అందుకే అల్లోపతి డ్రగ్స్ ట్రయల్స్ ఫలితాలు చూస్తే, అవి వెయ్యి మందికి ఈ మందిస్తే ఇంత శాతం మందికి మంచి ఫలితాలు వొచ్చాయి. ఇంత శాతం మందికి రియాక్షన్ అయ్యింది అని వుంటుంది. ఇదే అల్లోపతి లో వున్న అసలు సమస్య. 

అల్లోపతి శరీరధర్మశాస్త్రం గురించి బోధిస్తుంది. కానీ అది శరీరాన్ని ఒకే రకంగా చూస్తుంది. ఆయుర్వేదం ఐదు రకాల శరీరాలను గుర్తిస్తుంది. ప్రాచీన యుద్ధకళలు కూడా అంతే. గురుదేవులు గల్లా ప్రకాశ్ రావు ప్రకారం ఈ కింది శరీర ప్రకృతులు వుంటాయి. 

Fire body

Metal body

Earth body

Water body

Wood body 

వీటన్నిటినీ నడిపించేది జీవశక్తి. దాన్ని శరీరమంతా ప్రసరించేలా చేసేది ఫైర్. ఆక్సిజన్ (గాలి) అందితేనే అగ్ని (ఫైర్) మండి జీవశక్తి (లైఫ్ ఎనర్జీ) శరీరమంతా వ్యాపిస్తుంది. కాబట్టి శరీరం లోపలి ప్రకృతిని బ్యాలెన్స్ చేసే చికిత్స విధానాలు ఆక్యుపంక్చర్, అక్కుప్రెషర్. 

మనకు అనేక పరిమితులు వున్నాయి. మనం కనిపెట్టిన మెడికల్ టెక్నాలజీ కూడా గుర్తించలేని విషయాలు మన దేహంలో చాలా వున్నాయి. మన టెక్నాలజీ ప్రకారం అవి కనపడలేదు కాబట్టి అవి లేవని అనకూడదు. వాటిని గుర్తించే టెక్నాలజీ ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అలాగే అన్నీ టెక్నాలజీ ఒక్కటే చేయలేదు. సరైన వైద్యుడు కావాలి. నాడీ పరిశీలన అనేది అల్లోపతి లో బిపి చెక్ చేయడానికి మాత్రమే. దానికి బిపి మిషన్ కనిపెట్టారు. కానీ నాడీ పట్టుకొని శరీరంలో పంచభూతాలు ఎలా వున్నాయి, వాటి మధ్య బ్యాలెన్స్ వున్నదా లేదా అని తెలుసుకొని, దాని ప్రకారంగా చికిత్స ఇచ్చే విధానాలు ఆయుర్వేదం, సిద్ధ, యునాని, అక్కుప్రెషర్. 

కాబట్టి ప్రయోగాలు, వాటి ఫలితాల డాటా బేస్ మాత్రమే శాస్త్రీయతకు కొలమానం కాదు. మన పరికరాలకు, ప్రొసీజర్ కు ఆవల చాలా వ్యవహారం వుందని ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. 

డా. జిలుకర శ్రీనివాస్


డా. జిలుకర శ్రీనివాస్ కు ఆయుర్వేదంలో ఇంతపట్టు వుందని ఇంతవరకు నాకు  తెలీదు. అయితే ఈ వాదననీ కేంద్ర ఆయుష్ శాఖ, బాబా రాందేవ్ చాలా కాలంగా చేస్తున్నారు. నా వరకైతే  ఇది ఆసక్తికర పరిణామం.  


What Is Your Soul Element?


The twelve elements of nature are:


Earth

Water

Wind

Fire

Thunder

Ice

Force

Time

Flower

Shadow

Light

Moon



No comments:

Post a Comment