Saturday, May 22, 2021

నేటి నుంచి కృష్ణపట్నంలో కరోనా మందు పంపిణీ.

 నేటి నుంచి కృష్ణపట్నంలో కరోనా మందు పంపిణీ.

  Written by : Suryaa Desk Updated: Fri, May 21, 2021, 12:22 PM


నాటు వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన ఆయుర్వేదం మందు

మందు తయారీ కి వనమూలికలు సిద్ధం చేస్తున్న స్వయం సేవకులు

మీడియాతో మాట్లాడుతున్న బొనిగి ఆనందయ్య, నాటు వైద్యుడు, కృష్ణపట్నం.

కరోనా రోగులకు కృష్ణపట్నం ఆయుర్వేదం వేసుకోండి.అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.నేటి నుంచి కృష్ణపట్నంలో కరోనా మందు పంపిణీ. ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం, గ్రామస్తులు.ప్రపంచ చరిత్రలో కృష్ణపట్నం కు గుర్తింపు.తొలిరోజు కరోనా పాజిటివ్ రోగులకు ఆయుర్వేద మందు పంపిణీ. రెండవ రోజు నుంచి పదివేల మందికి సరఫరా. సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి మందు పంపిణీ. కరోనా రోగుల పాలిట దేవుడు రూపంలో నాటు వైద్యుడు బోనిగి.

ముత్తుకూరు మే 20 (సూర్య మేజర్ న్యూస్) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామపంచాయతీలో కరోనా వైరస్ నిర్మూలనకు తయారుచేసిన ఆయుర్వేద మందు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అనుమతులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి సంబంధించిన నాటు వైద్యులు, మాజీ సర్పంచ్ అయిన బోనిగి ఆనందయ్య ఆయుర్వేద మందు కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

 ఈ నేపథ్యంలో తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు భారతదేశమంతటా కృష్ణపట్నం వైపు కరోనా రోగులు చూస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా రోగులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకున్న ప్పటికీ బతుకుదామని ఆశ లేకపోగా కనీసం చనిపోతే శవాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య పైసా ఫీజు లేకుండా స్వలాభం ఆశించకుండా సొంత ఖర్చులు దాతల సహకారంతో కరోనా వైరస్ నిర్మూలనకు తనకున్న అనుభవంతో ఆయుర్వేద మందు ను కనుగొని నేటి నుంచి భారతదేశమంతటా ఈ మందులను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ వైపు ప్రజలు జేజేలు పడుతుండగా స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ శాఖ అధికారులు కృష్ణపట్నం గ్రామానికి విచ్చేసి నాటు వైద్యుడు తయారుచేసిన కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేత చేపట్టి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఆయన కనిపెట్టిన నాటు మందు పై విజయవాడలో ల్యాబ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ అధికారులు పరిశోధన చేసి  చివరకు ఈ నాటు మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని నిర్భయంగా ఆయుర్వేదం మందు కరోనా రోగులకు వాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తో ఈ కరోనా మందు ప్రజల చేతుల్లోకి రాబోతూ వారి ప్రాణాలను కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. నాటు వైద్యుడు తయారుచేసిన ఆయుర్వేద మందు పై లోకాయుక్త లో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు.  

నాటు వైద్యుడు తయారు చేసిన మందులో శాస్త్రీయత లేదని ఆయన వాడిన పదార్థాలు ఏమిటి అని ఈ విషయం స్పష్టంగా వివరణ ఇవ్వాలని  లోకాయుక్త లో కేసు నమోదు కాగా ఈ ఆయుర్వేద మందులు ల్యాబ్ లో పరిశీలించిన అధికారులు జిల్లా కలెక్టర్ నివేదిక అందజేశారు. ఈ నివేదికలో నాటువైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ మందులు వేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని తేల్చి చెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్ ఈ మందు పంపిణీ కి ఓకే చెప్పారు. సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపి అనుమతులు మంజూరు చేసేలా కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగులకు ఈ ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తుందని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం కృష్ణపట్నం లో మందు పంపిణీ తగిన ఏర్పాట్లు చేసింది. పోలీస్, రెవెన్యూ శాఖ, ఆయుష్, పంచాయతీరాజ్ శాఖ, గ్రామ సచివాలయం వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు ఈ మూత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే అక్కడ రాత్రి పగలు అనే తేడా లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఆయుర్వేద మందులు పంపిణీ జరిగేలా నాటు వైద్యులు ఆనందయ్య తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. గ్రామస్తులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. 

ఈ ఆయుర్వేద మందు పంపిణీ లో విభాగాలు ఉన్నాయి.1 కరోనా వైరస్ రాకుండా మందు తీసుకోవడం.2 కరోనా పాజిటివ్ రోగులకు పి, ఎఫ్, ఎల్ అనే నామకరణం తో ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్ తగ్గి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగికి కంటిలో చుక్కల మందు వేస్తారు. ఈ మందు కోసం వచ్చేటువంటి జనం వారి అవసరాన్ని బట్టి తీసుకునే విధంగా అక్కడ అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే సుమారు వందమందికి పైగా గ్రామస్తులు సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కరోనా వైరస్ తో పేద ధనిక తేడా లేకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి కనీసం చనిపోతే మృతదేహాలు ఇంటికి రాకపోగా మానసిక క్షోభకు గురి అవుతున్న నేపథ్యంలో నాటు వైద్యుడు ఆనందయ్య ఆయుర్వేదం మందు కరోనా రోగుల పాలిట కల్పతరువుగా మారింది. నాటువైద్యం ఈ సమయంలో దేవుడిలా ఉన్నారని ప్రజలు అంటున్నారు.

తొలిరోజు కోవిడ్ పాజిటివ్ రోగులకు ఆయుర్వేదం మందు పంపిణీ.

..........................................

కృష్ణపట్నం గ్రామంలో నాటు వైద్యులు తయారు చేసిన ఆయుర్వేద మందులు తొలిరోజు అనగా శుక్రవారం కేవలం కరోనా పాజిటివ్ రోగులకు మాత్రమే ఇచ్చే ఇచ్చే అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. నేపథ్యంలో స్థానిక స్థానికేతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కరోనా రోగుల బాధిత కుటుంబాలు సామాజిక దూరం పాటించేలా అక్కడ క్యూ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు పరిశ్రమల యాజమాన్యాలు అక్కడ సహకారం అందిస్తున్నాయి. సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసి మొదటి రోజు కోవిద్ పాజిటివ్ రోగులకు ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తారని నాటు వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఆయనకు మద్దతు తెలుపుతూ కరోనా రోగులకు ఆయుర్వేద మందులు ఇవ్వాలంటూ మేము ఉన్నాము మీ వెంట ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. మందు పంపిణీ చేసే ప్రాంతంలో ఏర్పాట్లు జరిగాయి.

రెండవ రోజు నుంచి పదివేల మంది కి ఆయుర్వేద మందు పంపిణీ చేసేలా చర్యలు.

కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేదం మందు పంపిణీ పై సాయంత్రం మీడియాతో నాటు వైద్యులు ఆనందయ్య మాట్లాడారు. మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామస్తులు హాజరయ్యారు. సందర్భంగా నాటువైద్యం మాట్లాడుతూ తొలిరోజు కరోనా పాజిటివ్ రోగులకు మందులు పంపిణీ చేసి రెండో రోజు నుంచి సుమారు పదివేల మందికి మందులు పంపిణీ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయుర్వేదం మందు తయారీ కి సంబంధించిన సామగ్రిని దాతలు ఇచ్చే అవకాశం ఉందని నాటు వైద్యులు అన్నారు.



No comments:

Post a Comment