కృష్ణపట్నంకు నేడు ఐసీఎంఆర్ బృందం
May 24, 2021, 04:06 IST

ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందు
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును క్షుణ్ణంగా పరీక్షించే నిమిత్తం సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం రానుంది. ఈ మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేశారు.
Powered by Streamlyn
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా, కరోనా బాధిత కుటుంబాల్లో ఆసక్తి అధికమైంది.
No comments:
Post a Comment