ఆయుర్వేదాన్ని విమర్శించడం తప్పు కాదా? రాందేవ్ బాబా ఫైర్
22May 24 2021 @ 21:30PMహోంజాతీయం
న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లేఖపై యోగా గురువు రాందేవ్ బాబా స్పందించారు. కష్ట కాలంలో వైద్యులు చేస్తున్న సేవను తానెప్పుడూ చిన్నబుచ్చలేదని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఎందుకింత అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఇవే వ్యాఖ్యలు అమెరికా వైద్యులు చేస్తే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? అని నిలదీశారు. కరోనాకు ఎలాంటి మందూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని గుర్తు చేశారు. కరోనా లక్షణాలేవీ బయటికి వెల్లడి కాకున్నా, మందులిచ్చేస్తున్నారని, అయినా ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడూ వైద్యులను గౌరవిస్తూనే ఉంటానని, ఆధునిక వైద్య విధానాన్ని కూడా గౌరవిస్తానని స్పష్టం చేశారు. అన్నింటినీ గౌరవిస్తానని, కానీ ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎందుకు అవమానిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆయుర్వేదాన్ని విమర్శించడం, సూడో సైన్స్ అనడం, దుర్వినియోగ విధానం అని ప్రచారం చేయడం తప్పు కాదా? అని ధ్వజమెత్తారు. తానెప్పుడూ అల్లోపతిని విమర్శించనని రాందేవ్ బాబా స్పష్టం చేశారు.
No comments:
Post a Comment