సైన్స్ గొడవ నీకెందుకయ్యా?
----‐‐--------------------------------
:‘బాబా’ రామ్ దేవ్ కు aims డాక్టర్ బహిరంగ లేఖ
-‐-----------------------------------------------------------
అనువాదం : రాఘవ శర్మ ‘ద వైర్‘ సౌజన్యంతో
By Trending News
ప్రియమైన రాందేవ్ యాదవ్ గారు,
మీమ్మల్ని ‘బాబా’ అని పిలవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, అది చాలా గౌరవ ప్రదమైన మాట.
నిజాయితీగా చెప్పాలంటే, మీరు ‘బాబా’ అన్న పేరును తగిలించుకోవడం, ఒక విజయవంతమైన వ్యాపారి అనే కళ్ళజోడు తగిలించుకోవడం లాంటిదే.
నాకు ఇష్టమైన బాబా ఫరీద్ గంజ్-ఈ-షకర్ ఏం చెప్పారంటే, “నువ్వొక సాధువు స్థాయికి చేరుకోవాలంటే రాజకుటుంబానికి దూరంగా ఉండాలి” అని.
అలోపతి డాక్టర్లు, ఆ వైద్యం పట్ల ఇటీవల మీరు చేసిన అసహ్యకరమైన ఎగతాళి ద్వారా మీ నిరాశను అర్థం చేసుకోగలుగుతాను.
ఏ వైద్యుడైనా సరే జబ్బు పడ్డ మనిషిని ఆరోగ్యవంతుడిని చేయగలుగుతాడు.
కానీ, దేశానికి హానికరమైన జబ్బు చేస్తే, రాజ్యం చేతులెత్తేసినప్పుడు, డబ్బు సంపాదనకు దీనిని ఒక అవకాశంగా వైద్యులు భావిస్తారు.
మీరు చెప్పే, మీకిష్టమైన తేలికైన సామెతల్లో చెప్పాలంటే, ‘మాంసాన్ని పసిగట్టిన కుక్కలు’ అని.
అన్ని రకాల కుక్కలు కలిసి విందు చేసుకోవడానికి కావలసినంత మాంసాన్ని ఈ కరోనా మహమ్మారి కల్పించిందనడంలో సందేహం లేదు.
రామ్ దేవ్ గారు, కుక్కలు ఒకదాన్నొకటి గౌరవించుకుంటాయి.
ముఖ్యంగా, తమ పరిమితులను తాము తెలుసుకునే తమ శక్తిని తాము గౌరవించుకుంటాయి.
ఇంకో విషయమేమంటే కుక్కలకంటే నక్కలు చాలా ప్రమాదకరమైనవి. ఆకలేసినప్పుడు, కోపమొచ్చినప్పుడు అవి అరుస్తాయి.
నిజానికవి అవి చాలా పిరికివి.
తమ కంటే బలమైన శత్రువు వస్తే తింటున్న కళేబరాన్ని సగంలో వదిలేసి పారిపోతాయి.
కనీసం మనం నక్కలలాగా వ్యవహరించకూడదని మాట ఇద్దాం.
అలోపతి వైద్యులను, ఆ వైద్యాన్ని మీరు అసహ్యంగా విమర్శించిన విధానాన్ని చూస్తే, మీ అహంకారమే
మీ చేత ఆ పనిచేయించిందని, అలా మీరు వ్యవహరించారని నేను ఊహించుకోవడం తప్పు కాదు.
మీ లాంటి తెలివైన వ్యాపార వేత్త నుంచి వచ్చే ఈ చిల్లర వ్యాఖ్యానాల గురించి ఇంతకంటే ఏం వివరిస్తాం?
నా సహ వైద్యుల నుంచి మీకు ఎదురు దెబ్బలు తగులుతాయని ఊహించనంతటి అమాయకులు కాదు కదా!?
మీరంత తెలివి తక్కువ యాదవ్ గారు అని నేనుకోవడం లేదు.
ఎవరి మూలాలను వారు కాపాడుకుంటారు; డాక్టర్లు కూడా అంతే. అలోపతి గురించి ఆ వైద్యుల గురించి వీడియోల్లో మీరన్నది అశాస్త్రీయమే కాదు, మీ అజ్ఞానం కూడా.
అందునా, ద్వేషంతో కూడిన అజ్ఞానం.
అజ్ఞానం ద్వేషంతో కలిస్తే, విషపూరితమై, అది ద్వేషించే వ్యక్తిని కూడా దహించేస్తుంది.
అనేక సందర్భాలలో అలాంటి అజ్ఞానాన్ని మీలో చూశాను.
ఆ విషయాలను ఈ సమయంలో చర్చించదలుచు కోలేదు.
ఎందుకంటే, మీ తెలివితక్కువ మాటలకు క్షమాపణలు చెప్పాలన్న ఉద్దేశ్యంలో మీరు ఉన్నట్టు గమనించాను.
నా సహ వైద్యులకు మీరెందుకు క్షమాపణ చెపుతారు? దేశ ఆరోగ్య శాఖామంత్రి కూడా అలోపతి వైద్యుడే కదా!
మీకు తగిన పరిజ్ఞానం లేక కాదు, మీలో ఉన్న మితిమీరిన ఆత్మస్తుతి వల్లనే అలోపతి వైద్యాన్ని మీరు వ్యతిరేకించడం.
మీరు ఆయుర్వేద శాస్త్రం పట్ల ఎంత బాగా ఉన్నారంటే, అందరూ దాన్ని అనుమానించేలా చేశారు.
కేంద్రీకృత అధికారం అనేది హేతుబద్ధతకు పూర్తిగా శత్రువు.
రామ్ దేవ్ గారు, క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులను కూడా మీరు నయంచేస్తారనడం హాస్యాస్పదం.
బ్లడ్ క్యాన్సర్ ను నయం చేస్తున్నానని అనేక వీడియోల్లో మీరు చెప్పడం వల్ల ప్రపంచం దృష్టిలో నవ్వులపాలయ్యారని ఎప్పుడైనా గమనించారా?
మీ పర్యవేక్షణలో ఉన్న రోగుల్లో బ్లడ్ క్యాన్సర్ వ్యాధి పాక్షికంగా తగ్గి ఉండవచ్చు కానీ, పూర్తిగా తగ్గిందని చెప్పడం తెలివితక్కువ తనం కాక మరేమిటి?
మీ వైద్యాన్ని మీరు కాపాడుకునేందుకు మీరు ఆర్థిక ప్రయోజనాలున్నాయన్న విషయం నాకు తెలుసు.
మీకున్న 9,500 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం కోసమే ఇలా చేస్తున్నారని కూడా తెలుసు.
అయుర్వేదమైనా, అల్లోపతి అయినా, హోమియోపతి అయినా వాటి పరిశీలనకు, ధృవీకరణ లొంగిఉండాల్సిందే.
అంతరించి పోతున్న మీ మాటలు, మీ రంగమే మీ సంపూర్ణ వాదం.
సందేహ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. వైద్యులను ప్రశ్నించడం సరైనదే.
శాస్త్ర జ్ఞానం తో పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రావడం పాపం.
అద్భుతమైన ‘కొరోనిల్’ మందు అని మీరు ఏదైతే చెపుతున్నారో, ఆ సంజీవనిలో ‘గిలోయ్’ (giloy) అనే రసాయనపదార్థం వాడారు.
దాని చర్య చాలా విపత్కరమైనదని నా స్నేహితులైన చాలా మంది లివర్ నిపుణులు అంటున్నారు.
లివర్ పైన ఈ ‘గిలోయ్’ విషపూరితమైన ప్రభావం చూపుతోందని వారు స్పష్టంగా గమనించారు.
వారింకా దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. దాన్ని ధృవీకరించాలని భావిస్తున్నారు.
I suppose as a businessman who has such phenomenal success in the field, you should really mind your business. It is my humble request to you that you should leave science and rationality to us.
ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికంటే ముందు వారి అనుమానాలను వారు నివృత్తి చేసుకోవాలి.
రామ్ దేవ్ గారు, అదీ అలోపతి చేసే పని.
అదే శాస్త్ర విజ్ఞానం చేసేపని.
నాకు తెలుసు, ఎప్పుడో ఒకప్పుడు మీకు కూడా అలోపతి అన్నా, శాస్త్ర విజ్ఞాన మన్నా గౌరవం ఏర్పడుతుందని.
మీరొక రోగాన్ని నయంచేశానని చెప్పే స్థితిలో ప్రతి సారి ఒక అల్లోపతి డాక్టర్‌ను ఎందుకు తీసుకొస్తారు?
మీరు చెప్పే వాటి ప్రామాణికత గురించి అల్లోపతి వైద్యుడిని అడుగుతున్న సందర్భాలు చాలా వీడియోల్లో చూశాను.
నిజానికి ఇది వింతే. మీ రంగానికి, నా రంగానికి మధ్య జరిగే యుద్ధం కాదిది.
మీది ఆర్థిక ప్రయోజనమే అయినట్టయితే, శాస్త్ర జ్ఞానం హేతుబద్దతలే తప్పకుండా విజయం సాధిస్తాయి.
నేను శాస్త్రజ్ఞానం వైపే ఉన్నాను.
శాస్త్రజ్ఞానం నా వాదనకు పనికి వచ్చే వాటిని కూడా అనుమానించి, పరిశీలించి, ఆతర్వాతే సత్యాన్ని వెలికి తీసుకొస్తుంది.
ఒక వ్యాపారవేత్తగా ఈ రంగంలో రాణించదలుకుంటే, మీ దృష్టిని వ్యాపారంపై కేంద్రీకరించండి.
హేతుబద్దతని, శాస్త్రజ్ఞానాన్నిమాకు వదిలేయండని నా సవినయ విన్నపం.
నీతి లేనివైద్యుడైనా, అన్యాయ పాలకుడినైనా, నకిలీ బాబాల నైనా చరిత్ర పట్టేస్తుందన్న విషయం మరిచి పోకూడదు .
No comments:
Post a Comment