Alcohol Linked to Higher Cancer Risk, Warns US Surgeon General
Health risks: ఆల్కహాల్‌తో క్యాన్సర్ ముప్పు!
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:56 AM
మద్యం ఉత్పత్తులపై హెచ్చరికలు ఉండాలి.. అమెరికా సర్జన్ జనరల్ సూచన
వాషింగ్టన్, జనవరి 5: ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనేది అందరికీ తెలిసిన విషయమే..! కానీ.. మద్యం తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికా సర్జన్ జనరల్ మరోసారి హెచ్చరించింది. మద్యం బాటిళ్లపై హెచ్చరికలతో కూడిన లేబుళ్లు వేసి ప్రజలకు అవగాహన కల్పించాలని యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి పిలుపునిచ్చారు. అంతేకాదు మనం నిత్యం వంటకాల్లో వాడే సన్‌ఫ్లవర్, ద్రాక్ష గింజల ఆయిల్ వంటి కొన్నిరకాల విత్తన నూనెల కారణంగా పెద్దపేగు కేన్సర్ రోగులు కూడా పెరుగుతున్నారని అమెరికాలోని మరో అధ్యయనం సూచించింది. అమెరికాలో ఆల్కహాల్ వల్ల ఏటా దాదాపు 1,00,000 మంది కేన్సర్ బారిన పడుతుండగా వారిలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సర్జన్ జనరల్ వివేక్ మూర్తి పేర్కొన్న మేరకు.. పొగాకు, ఊబకాయం తర్వాత కేన్సర్‌కు మూడో అతిపెద్ద కారణం ఆల్కహాల్. మద్యం సేవించడం వల్ల రొమ్ము, కాలేయం, పెద్దపేగు, అన్నవాహిక, గొంతు సహా ఏడు రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని శాస్ర్తీయ పరిశోధనల్లో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ప్రమాదాన్ని సూచించేలా ఆల్కహాల్ ఉత్పత్తులపై నూతనంగా రూపొందించిన ఆరోగ్య హెచ్చరికలను తప్పనిసరి చేయాలని సర్జన్ జనరల్ అమెరికా కాంగ్రె్‌సను కోరింది. పొగాకు వల్ల కేన్సర్ వస్తుందని 91ు మంది అమెరికన్లు గుర్తిస్తుండగా.. 50ు మంది మాత్రమే ఆల్కహాల్‌ను క్యాన్సర్ కారకంగా గుర్తిస్తున్నారు. కాబట్టి దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సర్జన్ జనరల్ కోరింది. దీన్ని ఆల్కహాల్ బేవరేజెస్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా, అంతర్జాతీయంగా ఐర్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే ఆల్కహాల్ ఉత్పత్తులపై కేన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేశాయి.
వంట నూనెలతోనూ..
ఇళ్లలో, రెస్టారెంట్లలో వాడే సన్‌ఫ్లవర్ ఆయిల్, ద్రాక్ష గింజల నూనె, కనోలా, మొక్కజొన్న నూనెలతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద పేగు క్యాన్సర్ ముఖ్యంగా యువకుల్లో ఈ తరహా కేన్సర్ పెరుగుదలకు ఈ వంట నూనెలే కారణమని తేలింది. అధ్యయనంలో భాగంగా 30 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న 80 మంది పెద్దపేగు కేన్సర్ రోగుల కణితలను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. వారి కణితుల్లో చాలాఎక్కువ స్థాయిలో బయోయాక్టివ్ లిపిడ్లు ఉన్నాయి. విత్తనాల నుంచి వచ్చే నూనెల వాడకం వల్ల.. బయోయాక్టివ్ లిపిడ్లు అధికంగా పెరుగుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
No comments:
Post a Comment